Vastu tips: టీ జంక్షన్ రోడ్ పక్కన ప్లాట్ కొనవచ్చా.. అపార్ట్ మెంట్కు వీధిపోటు ఉంటే ఇబ్బందులు ఉంటాయా..!

Vastu tips:  టీ జంక్షన్ రోడ్ పక్కన ప్లాట్ కొనవచ్చా.. అపార్ట్ మెంట్కు వీధిపోటు ఉంటే ఇబ్బందులు ఉంటాయా..!

కొత్తగా ఇల్లు కొన్నా.. ఇల్లు కట్టినా కచ్చితంగా వాస్తు నియమాలు పాటించాల్సిందే. అయితే అపార్ట్​మెంట్స్​ లో ప్లాట్​ కొనేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి.. టి.జంక్షన్ రోడ్ పక్క ప్లాట్స్ కొంటే ఇబ్బందులు ఉంటాయా.. అపార్ట్​మెంట్స్​ విషయంలో వీధిపోటు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి.. ...మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న: టి.జంక్షన్ రోడ్ పక్క ప్లాట్స్  ఉన్నాయి. అలాంటి స్థలంలో ప్లాట్ కొనుక్కోవచ్చా?

జవాబు: టీ జంక్షన్ పక్కన ఉన్న ప్లాట్స్ తీసుకోవడంలో తప్పేమీలేదు. అయితే వీధి శూల ఉందా? లేదా? అని చూసుకోవాలి. వీధి పోటు లేని స్థలమైతే నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.


ప్రశ్న: మా అపార్ట్మెంట్ కు ఎదురుగా వీధి ఉంది.. ఎత్తుగా ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్స్​ కు  వీధి పోటు వర్తించదు అని చెప్పారు. అది నిజమేనా?

జవాబు: అపార్ట్మెంట్స్ కు వీధి పోటు వర్తించదు. ఎందుకంటే అపార్ట్మెంట్ పై ఫ్లోర్స్  లో ఫ్లాట్స్ ఉండి. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంటుంది. అక్కడ నివాసం ఉండరు కాబట్టి వీధి పోటు ఉండదు.