జ్యోతిష్యశాస్త్రంలో పారిజాత పరివర్తన యోగం అనేది చాలా శక్తివంతమైనది. జాతక చక్రంలోని రెండు గ్రహాలు తమ రాశులను పరస్పరం మార్చుకున్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. దేవి నవరాత్రి ఉత్సవాల సమయంలో జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 16, 17, 18 తేదీల్లో గురు, చంద్రుల మధ్య ఏర్పడే పారిజాత పరివర్తన యోగం వల్ల ఆరు రాశుల వారికి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!
మేష రాశి: పరివర్తన పారిజాత యోగం ప్రభావంతో ఈ రాశి వారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతిని సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరగుతుంది.. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనేక విధాలుగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. శత్రువుల నుంచి సైతం ఆర్థిక లాభం ఉంటుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం, రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందడం, మొండి బాకీలు వసూలు కావడం,వ్యాపారాలు విజయాలు సాధించడం వంటివి జరుగుతాయి
మిథునరాశి: పారిజాత పరివర్తన యోగం వలన ఈ రాశి వారి గోచారం అద్భుతమైన ఫలితాలు తీసుకువస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు వేచి చూస్తున్నాయి. సీనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇంటి వాతావరణం సంతోషకరంగా, ఉత్సాహంగా ఉంటుంది. భాగస్వామితో సమయం గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. దీర్ఘకాలం నుంచి ఉన్న వివాదాలు, తప్పుగా అర్థం చేసుకోవడాలూ, అపార్థాలూ తీరిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి: పారిజాత పరివర్తన యోగం వలన ఈ రాశి వారికి సమాజంలో గౌరవం.. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కోరుకున్న అమ్మాయితో వివాహ యోగం కల్గుతుంది. రాజకీయ నాయకులకు పదవీ యోగం ఉందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఉద్యోగస్తులకు పురోగతికి అవకాశాలు ఏర్పడుతాయి. ఈ సమయంలో మీరు కుటుంబ జీవితాన్ని ఆనందిస్తారు.ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది.. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కన్యా రాశి: పారిజాత పరివర్తన యోగం వలన ఈ రాశి వారు సంతాన విషయంలో శుభ వార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలు కలిసివస్తాయి. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకోకుండా ధనలాభం కలుగుతుంది.విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తగ్గి, సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారు గుడ్ న్యూస్ వింటారు.
తుల రాశి: పరివర్తన పారిజాత యోగం వలన ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా ఆలోచించరు. కష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ విజయాన్ని అందుకుంటారు. కుటుంబమంతా సంతోషంగా ఉండాలని, అందర్నీ కలపడం కోసం ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకోకుండా రాజీమార్గంలో పరిష్కారమై, బాగా లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు లభిస్తాయి. గృహ యోగం పట్టే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి: పారిజాత పరివర్తన యోగం వలన ఈ రాశి వారికి సానుకూల పరిస్థితులు పెరిగి, కొత్త ఆలోచనలు మనసులో ఉద్భవిస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఇది, ఆర్థిక స్థితి బలపడుతుంది. దీర్ఘకాలం నుంచి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కెరీర్లో పెద్ద టార్గెట్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి, వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో ని వారితో మంచిపెళ్లియోగం కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
