న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో అక్టోబర్ 16న కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన తిరంగా లెహ్రా దో కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు ఢిల్లీలో సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే బస చేస్తోన్న ప్రదేశానికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. శాంతి భద్రతల కారణాలతో కన్నాట్ ప్లేస్లో 163 సెక్షన్ అమలులో ఉందని.. ఆ ప్రాంతంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని చెప్పారు.
తిరంగా లెహ్రా దో యాత్రను రద్దు చేసుకోవాలని దీప్కేకు సూచించారు. ఈ సందర్భంగా అభిజిత్ దీప్కే పోలీసులతో మాట్లాడుతూ తనపై తప్పుడు అభియోగాలు మోపడంపై తీవ్ర అసంతృప్తి చేశారు. తాము ఎటువంటి హింసకు పిలుపునివ్వలేదని.. కేవలం చేతుల్లో జాతీయ జెండా పట్టుకుని శాంతియుతంగా ర్యాలీ తీస్తామని చెప్పారు. తాను హింసను ప్రేరేపించేలా మాట్లాడినట్లు ఒక్క సాక్ష్యమైన చూపించాలని పోలీసులకు సవాల్ విసిరారు.
►ALSO READ | యూపీ వ్యాపారవేత్త మృతి కేసులో ట్విస్ట్.. సీసీటీవీకి చిక్కిన శ్రద్ధా దుబే ? రూ.25 వేల రివార్డు ప్రకటన..
తాను హింసను ప్రేరేపించినట్లు రుజువైతే తనను ఉరి తీయండని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరంగా లెహ్రా దో ర్యాలీలో లౌడ్స్పీకర్లు వాడబోమని.. కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామని చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో జాతీయ జెండా ఎగురవేయడానికి కూడా అనుమతి లేదా పోలీసులను నిలదీశారు.
కాగా, నిరసనలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఢీనోటిఫై చేసిన జంతర్ మంతర్లో నిరసన వ్యక్తం చేసిన కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలపై కేసు, అరెస్ట్ ను నిరసిస్తూ అక్టోబర్ 16వ తేదీన ఢిల్లీలోని కన్నాట్ ప్లేసులో లెహ్రా దో తిరంగా యాత్రకు సీజేపీ పిలుపునిచ్చింది. శాంతి భద్రతల కారణాలతో సీజేపీ లెహ్రా దో తిరంగా ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
