మన శరీర ఆకారాన్ని బట్టి స్వభావం ఎలా ఉంటుందో చెప్పే శాస్త్రమే 'సముద్రిక శాస్త్రం'. ఇందులో మనిషి ముఖలక్షణాలు మాత్రమే కాదు.. నడిచేటప్పుడు నేల మీద పడే పాదముద్రలు (Footprints) కూడా మనిషి వ్యక్తిత్వాన్ని, అదృష్టాన్ని చెప్పగలవని నమ్ముతారు. మనం తడి కాళ్లతో నేలపై నడిచినప్పుడు పడే ముద్రలను బట్టి మనుషులను మూడు రకాలుగా విభజించవచ్చు. అవేంటో, వాటి ప్రత్యేకతలు ఏంటో చూద్దాం!
అరికాళ్ళు నేలకు పూర్తిగా తాకే పాదముద్రలు
మీరు తడి కాళ్లతో నేలపై నడిచినప్పుడు మడమ నుండి కాలివేళ్ల వరకు అరికాళ్ల భాగం అంతా పూర్తిగా నేలకు అతుక్కుపోయి స్పష్టంగా కనిపిస్తే.. దాన్ని 'పూర్తి ముద్ర పాదం' అంటారు. ఈ రకమైన పాదాలు ఉన్నవారు చాలా బలమైన వ్యక్తిత్వం, బలమైన స్వభావంతో ఉంటారు.
వీరు మంచి లక్షణాలు చూస్తే జీవితంలో సంతోషంగా, విలాసవంతంగా బతకాలని కోరుకుంటారు. అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడతారు. వారి లక్ష్యాల పట్ల ఎప్పుడూ పాజిటివ్గా ఉంటారు.
చిన్న లోపం ఏంటంటే వీరు కొద్దిగా సోమరితనంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ వీరు సోమరితనాన్ని వదిలేసి, కష్టపడే తత్వాన్ని పెంచుకుంటే జీవితంలో అద్భుతాలు సృష్టించగలరు.
మధ్యలో చిన్న ఖాళీ ఉండే పాదాలు
ఇలాంటి వారి పాదముద్రలో మడమ, కాలివేళ్లు స్పష్టంగా కనిపిస్తాయి కానీ, అరికాళ్ల మధ్య భాగం మాత్రం నేలకు తగలదు. ఒక చిన్న గ్యాప్ వస్తుంది.
వీరి స్వభావం సముద్రిక శాస్త్రం ప్రకారం వీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. క్రియేటివిటీ ఎక్కువ. మంచి లక్షణాలు ఏంటంటే కుటుంబానికి, బంధుమిత్రులకు చాలా విలువిస్తారు. తోటివారికి ఎప్పుడూ సహాయం చేయడానికి ముందుంటారు. ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
చిన్న లోపం ఏంటంటే.. వీరు ఎవరికైనా తొందరగా భావోద్వేగపరంగా కనెక్ట్ అవుతారు. ఒకవేళ ఎవరివల్లనైనా బాధ కలిగితే, ఆ బాధనుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. చిన్న చిన్న సమస్యలను కూడా మనసులో పెట్టుకుని తెగ ఆలోచిస్తుంటారు.
ALSO READ : అక్టోబర్ నెలలో ఈ 4 తేదీలను అస్సలు మిస్ అవ్వొద్దు
మధ్యలో పెద్దగా ఖాళీ ఉండే పాదాలు
ఈ మూడో రకం వారి పాదాలు నేలపై అచ్చొత్తినప్పుడు.. మడమ, వేళ్లు మాత్రమే పడతాయి. మధ్యలో చాలా పెద్ద ఖాళీ (గ్యాప్) కనిపిస్తుంది. పాదం అడుగు భాగం ఎక్కువగా పైకి ఉండి వంపు తిరిగి ఉండటం వల్ల ఇలా జరుగుతుంది.
వీరి స్వభావం... ఇలాంటి పాదాలు ఉన్నవారు చాలా క్రియేటివ్గా ఉంటారు. లోతైన ఆలోచనలు చేసే తత్వం వీరిది. మంచి లక్షణాలు చూస్తే ప్రతి విషయాన్ని ఒక కొత్త కోణంలో చూస్తారు. కొత్త ఆలోచనలు చేయడం, ఎలాంటి సమస్యకైనా ఇట్టే పరిష్కారం కనుగొనడంలో వీరు దిట్ట.
చిన్న లోపం ఏంటంటే క్రియేటివిటిలో వీరు ముందున్నా.. రోజు ఉండే సాధారణ బాధ్యతలను, ప్రాక్టికల్ పనులను నిర్వహించడంలో మాత్రం ఇబ్బంది పడుతుంటారు.
చివరిగా మీ పాదాల ఆకారం ఎలాంటిదైనా సరే, మీలోని బలాలను సరిగ్గా ఉపయోగించుకుంటూ, బలహీనతలను సరిదిద్దుకుంటే జీవితంలో ఎదగడం పెద్ద కష్టమేం కాదు!
