అక్టోబర్ నెల ఇప్పటికే సగం అయిపొయింది. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ నెల చాలా మంచిది. 2026 సంవత్సరం (2+0+2+6 = 10 అంటే 1) అలాగే 10వ నెల అయిన అక్టోబర్.. రెండింటిలోనూ '1' అనే అంకె శక్తి ఉంది.
న్యూమరాలజీ ప్రకారం, 1 అంకెకు అధిపతి సూర్యుడు. అందుకే ఈ నెలంతా సూర్యుడి ప్రభావం, అనుగ్రహం ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ 10 వరకు పితృ పక్షాలు ఉండటం వల్ల చాలామంది కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించలేకపోయారు. అయితే, ఈ నెలలో మిగిలిన రోజుల్లో కొన్ని చాలా మంచి తేదీలు ఉన్నాయి. ఆ రోజున కొత్త వ్యాపారాలు మొదలుపెట్టినా లేదా భారీగా పెట్టుబడులు పెట్టినా మంచి ఫలితాలు ఉంటాయి.
ఆస్ట్రోపత్రి సంఖ్యాశాస్త్ర నిపుణులు తెలిపిన శుభ తేదీల వివరాలు ఇవే:
1. డబ్బు, పెట్టుబడులకు మంచి రోజులు
మీరు ఏవైనా పెద్ద ఫైనాన్షియల్ ప్లాన్ వేసుకోవాలన్నా, బడ్జెట్ సెట్ చేసుకోవాలన్నా లేదా డబ్బుకు సంబంధించిన ముఖ్యమైనవి నిర్వహించాలన్నా అక్టోబర్ 17, 23, 26 తేదీలు చాలా శ్రేష్ఠమైనవి. ఈ రోజుల్లో చేసే పెట్టుబడుల వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఆర్థిక లావాదేవీలన్నీ ఈ తేదీల్లోనే చేయడం మంచిది.
2. కెరీర్, వ్యాపారాల కోసం
కొత్తగా ఉద్యోగంలో చేరాలన్నా, ఇంటర్వ్యూలకు వెళ్లాలన్నా, కెరీర్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా అక్టోబర్ 19 ఇంకా 28 తేదీలు బాగా కలసివస్తాయి. ఈ రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఉద్యోగం మారాలనుకునే వారు కూడా ఈ తేదీల్లోనే ప్రయత్నించడం ఉత్తమం.
►ALSO READ | ఆధ్యాత్మికం: కర్ణుడు దానగుణం.. చివరిక్షణం వరకూ పోరాటం.. విశ్వాసం అంటే ఇదే..!
3. ప్రేమ, సంబంధ బాంధవ్యాల కోసం
వివాహ సంబంధాలు ఖరారు చేసుకోవడానికి, నిశ్చితార్థం లేదా సంబంధిత శుభకార్యాలు మాట్లాడటానికి అక్టోబర్ 15 మరియు 24 తేదీలు అనుకూలమైనవి. ఒకవేళ ఎవరితోనైనా గొడవలు ఉండి, సంబంధాలు దెబ్బతిని ఉంటే.. ఈ రెండు రోజుల్లో మాట్లాడి సర్దుబాటు చేసుకోవడానికి చొరవ తీసుకోండి, త్వరగా సమస్యలు సమసిపోతాయి.
అక్టోబర్ నెలలో మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే పైన పేర్కొన్న తేదీలను ఉపయోగించుకోండి!
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
