'దేవుడే వారిని చల్లగా చూడాలి'.. తనుశ్రీ దత్తా ఆరోపణలపై నానా పటేకర్ కొడుకు కౌంటర్!

'దేవుడే వారిని చల్లగా చూడాలి'.. తనుశ్రీ దత్తా ఆరోపణలపై నానా పటేకర్ కొడుకు కౌంటర్!

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ అకస్మిక మరణం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. గోవాలో గుండెపోటుతో 75 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. పుణెలోని ఆయన ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. అయితే, ఆయన మరణం తర్వాత నటి తనుశ్రీ దత్తా చేసిన విమర్శలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఆమె వ్యాఖ్యలపై నానా కుమారుడు మల్హర్ పటేకర్ ఇచ్చిన ఘాటు కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

కొన్నేళ్ల క్రితం 'హార్న్ ఓకే ప్లీజ్' షూటింగ్ సమయంలో తనపై నానా పటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనుశ్రీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2019లో ముంబై పోలీసులు సరైన సాక్ష్యాలు లేవని క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయగా, 2025 నాటికి ఆ చట్టపరమైన వివాదం ముగిసింది.

అయినప్పటికీ, నానా మరణం తర్వాత తనుశ్రీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఇదొక డ్రామా అని, అసలు ఆయన చనిపోయాడో లేదో డీఎన్ఏ టెస్ట్ చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ఆయనను "ఈవిల్ డెడ్", "సాడిస్టిక్ సైకోప్యాత్" అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. పరిశ్రమలో ఎవరికీ ఆయన అంత్యక్రియల సమాచారం ఇవ్వకపోవడంపై కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు.

►ALSO READ | RANABAALI ఫుల్ రివ్యూ: విజయ్ దేవరకొండ మూవీ ఎలా ఉందంటే?

తనుశ్రీ దత్తా  విమర్శలపై నానా కుమారుడు మల్హర్ పాటేకర్ తొలిసారి స్పందించారు.  ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించకుండా ఘాటుగా బదులిచ్చారు. 'కోర్టు ద్వారా ఎప్పుడో క్లియర్ అయిన పాత కేసుకు ఇప్పుడు మళ్లీ తెరలేపడం సరికాదు. చట్టం ప్రకారం కేసు ముగిసిపోయింది. అయినప్పటికీ కొందరు కావాలనే దీన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు. అలాంటివారి గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పను. నిజం ఏంటో అందరికీ తెలుసు, దేవుడే వారిని చల్లగా చూడాలి" అంటూ హుందాగా బదులిచ్చారు.

ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్న ఈ పరిణామాలు నానా పటేకర్ మరణం తర్వాత కూడా వివాదాలు వీడలేదు అన్న అభిప్రాయాన్ని పలువురు సినీ ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు. మన మధ్య లేని నానా పటేకర్ పై ఇప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సినీ వర్గాలు కోరుతున్నాయి.