- తొలి టీ20లో 4 వికెట్ల తేడాతో జింబాబ్వేపై విజయం
- రాణించిన దీప్తి శర్మ, నికీ ప్రసాద్
రాయ్పూర్: ఛేజింగ్లో దీప్తి శర్మ (49), డెబ్యూ ప్లేయర్ నికీ ప్రసాద్ (39 నాటౌట్) అద్భుతంగా ఆడటంతో.. జింబాబ్వేతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇండియా విమెన్స్ జట్టు బోణీ చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో ఇండియా 4 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఫలితంగా సిరీస్లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడిన జింబాబ్వే 20 ఓవర్లలో 114/5 స్కోరు చేసింది. షార్నే మేయర్స్ (43 నాటౌట్), కెల్లిస్ ఎన్డోవ్ (42) మెరుగ్గా ఆడినా.. మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే క్రాంతి గౌడ్ (1/16).. బిలవ్డ్ బిజా (0)ను డకౌట్ చేసింది. 7/1 స్కోరు వద్ద వచ్చిన మోడెస్టర్ ముపాచిక్వా (16)తో కలిసి ఎన్డోవ్ రెండో వికెట్కు 53 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది. 11వ ఓవర్లో ముపాచిక్వా.. శ్రీచరణి (1/14)కి వికెట్ ఇవ్వడంతో జింబాబ్వే స్కోరు 60/2గా మారింది. 15వ ఓవర్లో ఎన్డోవ్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన మేయర్స్ బ్యాట్ ఝుళిపించింది.
నయషా గువాంజురా (9), మిచెల్లి మువంగా (0)తో కలిసి 41 రన్స్ జత చేసింది. చివరి ఓవర్లో నందాని శర్మ (2/11) వరుస బాల్స్లో ఈ ఇద్దర్ని ఔట్ చేసింది. ఛేజింగ్లో ఇండియా 15.4 ఓవర్లలో 116/6 స్కోరు చేసి గెలిచింది. స్టార్టింగ్లో జింబాబ్వే బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేయడంతో ఇండియా టాప్ ఆర్డర్ విఫలమైంది. 19 బాల్స్ తేడాలో కెప్టెన్ స్మృతి మంధాన (9), అనుష్క శర్మ (4), హర్మన్ప్రీత్ కౌర్ (1), షెఫాలీ వర్మ (4) పెవిలియన్కు చేరారు. దాంతో ఇండియా 19/4తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో నికీ ప్రసాద్, దీప్తి శర్మ ఇన్నింగ్స్ను ఆదుకున్నారు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 14వ ఓవర్లో దీప్తిని ఒలిండర్ చారి (1/23) ఔట్ చేసింది. ఫలితంగా ఐదో వికెట్కు 82 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. చివర్లో రిచా ఘోష్ (7) నిరాశపర్చినా, నికీ ప్రసాద్, అరుంధతి రెడ్డి (2 నాటౌట్) ఈజీగా విజయాన్ని అందించారు. నయాషా గువాంజురా 3 వికెట్లు తీసింది. దీప్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
