లాస్ వెగాస్: అండర్–23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఇండియా రెజ్లర్ కోమల్ కాంస్య పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన విమెన్స్ 59 కేజీల పతక పోరులో కోమల్ 7–2తో విక్టోరియా ఖుసైనోవా (కజకిస్తాన్)పై గెలిచింది.
అలీనా ఫిలిపోవిచ్ (ఉక్రెయిన్)తో జరిగిన సెమీస్లో ఓడిన కోమల్.. తర్వాత రెపిచేజ్ రౌండ్ ద్వారా కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. విమెన్స్ 72 కేజీల్లో అమృత పూజారి గోల్డ్ మెడల్ రేసులో నిలిచింది. సెమీస్లో అమృత 10–8తో వెన్జిన్ క్వియు (చైనా)పై గెలిచింది. విమెన్స్ 53 కేజీల్లో స్వీటీ, 65 కేజీల్లో వైష్ణవి పాటిల్ రెపిచేజ్ రౌండ్ ద్వారా కాంస్య పోరుకు అర్హత సాధించారు.
