సీజేపీ నిరసనల వెనుక ఎలాన్ మస్క్ హస్తం : బీజేపీ నేత బ్రిజ్భూషణ్

సీజేపీ నిరసనల వెనుక ఎలాన్ మస్క్ హస్తం :  బీజేపీ నేత బ్రిజ్భూషణ్

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన ప్రదర్శన వెనుక టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హస్తం ఉందని బీజేపీ సీనియర్ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆరోపించారు. ఇది భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఒక పెద్ద కుట్ర అని  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం సీజేపీ చేపట్టిన ‘లహ్రా దో తిరంగా’ మార్చ్ నేపథ్యంలో ఈ రాజకీయ వివాదం మరింత ముదిరింది. 

ఈ ఉద్యమం అంతా ఎలాన్ మస్క్ ఆదేశాల మేరకే నడుస్తోందని బ్రిజ్ భూషణ్ ఆరోపించారు. 'ఇది మన దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఒక పెద్ద కుట్ర. మన దేశాన్ని బంగ్లాదేశ్, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లతో పోల్చుతున్నారు. సుప్రీంకోర్టును భయపెట్టే ఉద్దేశంతోనే ఈ మార్చ్ నిర్వహించారు. మన దేశంలో వ్యాపారం చేయాలని కోరుకునే ఈ విదేశీయులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారు' అని మండిపడ్డారు.