హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ గుర్తింపు సంఘానికి ఈ నెల 9న పోలింగ్ జరగడం, అదే రోజు కౌంటింగ్ పూర్తయి, అనధికారికంగా ఫలితాలు వెల్లడయ్యాయి. కాగా, ఆ ఫలితాలను కార్మిక శాఖ శనివారం అధికారికంగా ప్రకటించనుంది.
రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘంగా ఈయూ(ఎంప్లాయిస్ యూనియన్) గెలిచినట్లు, ఆ కూటమికి ఎన్ని ఓట్లు వచ్చాయో, టీడబ్ల్యూయూ( తెలంగాణ వర్కర్స్ యూనియన్) కూటమికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో, బరిలో నిలిచిన ఇతర యూనియన్లకు పోలైన ఓట్ల వివరాలను రిటర్నింగ్ అధికారి హోదాలో కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతా దాస్ గుప్తా వెల్లడించనున్నారు. జిల్లాల్లో కార్మిక శాఖ అధికారులు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ల హోదాలో తమ పరిధిలోని రీజియన్లలో ఏ యూనియన్ కు అధికారిక గుర్తింపు దక్కిందో ప్రకటించనున్నారు.
