దసరా సెలవుల జోష్‌తో ఈ వీకెండ్ మరింత కిక్కిస్తోంది. థియేటర్లలో విజయ్ దేవరకొండ 'రణబాలి', రజనీకాంత్ 'జైలర్ 2' వంటి భారీ చిత్రాలు మిక్స్డ్ టాక్‌తో రసవత్తరంగా సాగుతుంటే.. మరోవైపు ఓటీటీ ప్రియులకు పండుగ వాతావరణం వచ్చేసింది. ఈ శుక్రవారం (అక్టోబర్ 16) ఒక్కరోజే ఏకంగా 34 సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ముంచెత్తాయి. మరి ఈ వీకెండ్ మీ హౌస్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏయే ఓటీటీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం ..
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime):
తెలుగు డబ్బింగ్ ప్రేక్షకులను అలరించేందుకు క్రైమ్, థ్రిల్లర్ జోనర్స్‌తో 'లెనిన్ పాండియన్', అచ్చమైన తెలుగు మూవీ 'కుకూన్స్', అలాగే 'మాస్టర్ ప్లాన్', 'హొకుమ్' చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కొరియన్ సిరీస్ 'మేక్ మీ టింగిల్'(తెలుగు), పాపులర్ రియాలిటీ షో 'ద ట్రైటర్స్' కూడా కనువిందు చేస్తున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ (Netflix):
సరికొత్త కంటెంట్‌ను కోరుకునే వారి కోసం డబ్బింగ్ మూవీ 'ఎన్న విలై', టర్కిష్ క్రైమ్ థ్రిల్లర్ 'మనీట్రాప్: ద కరున్ ట్రెజర్', ఎంటర్టైనింగ్ ఇంగ్లీష్ సిరీస్ 'చికెన్ షాప్ డేట్' తదితర చిత్రాలు దూసుకువస్తున్నాయి.
ఆహా (Aha):
మన నేటివిటీకి దగ్గరగా ఉండే తెలుగు సినిమాలతో ఆహా అదరగొడుతోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ డ్రామా 'సుగ్రీవ', ఆలోచింపజేసే 'వసుదేవ సుతం', తమిళ డబ్బింగ్ చిత్రం'ఎన్ ఎన్నై ఏదో సేదై' తో పాటు థ్రిల్లింగ్ డబ్బింగ్ మూవీ'దహాన్' ఈ వీకెండ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
►ALSO READ | Bigg Boss Telugu 10: డేంజర్ జోన్లో షాలిని, వర్షిణి.. ఈ వారం ఎలిమినేషన్లో అసలైన ట్విస్ట్ ఇదేనా?
జీ5 & సన్ నెక్స్ట్ (ZEE5 & Sun NXT):
జీ5లో ఇంట్రెస్టింగ్ డబ్బింగ్ మూవీ 'ఆశా', సన్ నెక్ట్స్‌లో హార్ట్ టచింగ్ తెలుగు చిత్రం'కాగితం పడవలు', మలయాళ హిట్ మూవీ 'ఒరు అన్వేషినంతింటే తుడక్కం' స్ట్రీమింగ్ అవుతున్నాయి.
హాట్‌స్టార్ ( Hotstar)
డిస్నీ+ హాట్‌స్టార్‌లో 'కప్పీ స్క్వాడ్' (తెలుగు సిరీస్)
సోనీ లివ్ & మనోరమ మ్యాక్స్:
సోనీ లివ్‌లో 'డిసి', మనోరమ మ్యాక్స్‌లో మెడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్' ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
థియేటర్ వెళ్లలేని వారికి, ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో కలిసి దసరా లాంగ్ వీకెండ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేయడానికి ఈ 34 చిత్రాల పండగ పక్కా సరిపోతుంది. మరి -వాచింగ్ జాబితాలో ఏ సినిమా ముందుగా ఉంది? ఇంకెందుకు ఆలస్యం, పాప్‌కార్న్ రెడీ చేసుకొని చూసేయండి.
