బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఆరోవారం ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుండగా.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న షాలిని, వర్షిణి, అమన్ మసూద్, రోహిత్, రామ్ ప్రసాద్, వంశీలలో ఎవరి ప్రయాణం ముగుస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా షాలిని ఎలిమినేట్ అవుతుందనే ప్రచారం ఒకవైపు.. ఆమెను హౌస్‌లో కొనసాగించే అవకాశాలున్నాయనే అంచనాలు మరోవైపు ఆసక్తి రేపుతున్నాయి.
షాలిని ఎలిమినేషన్.. అంత ఈజీ కాదా?
ఆన్లైన్ పోల్స్‌లో షాలినికి తక్కువ ఓట్లు వస్తున్నాయనే అంచనాలు కనిపిస్తున్నాయి. అంతే కాదు షాలిని వల్లే రోహిత్ గేమ్ దెబ్బతింటోందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె బయటకు వెళ్తే రోహిత్ ఆటపై మరింత దృష్టి పెట్టగలడని అతడి అభిమానులు భావిస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమ, గొడవలు, భావోద్వేగాలు చుట్టూ నడిచే డ్రామాలో షాలిని కీలకంగా కనిపిస్తోంది. అందుకేఅందుకే ఆమెను ఇప్పుడే బయటకు పంపిస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఓటింగ్ వివరాలు, అధికారిక ప్రకటన లేకుండా ఆమెను కచ్చితంగా సేవ్ చేస్తారని లేదా ఎలిమినేట్ చేస్తారని చెప్పలేం.
వంశీకి కలిసొస్తున్న అదృష్టం..
ఈ వారం ఓటింగ్ అంచనాల ప్రకారం రోహిత్ బలమైన స్థానంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు త్రిగుణ్ నామినేషన్స్‌లో లేకపోవడంతో అతడికి మద్దతిచ్చే కొందరు వంశీ వైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ నడుస్తోంది. గురువారం ఎపిసోడ్లో వంశీకి వచ్చిన పాజిటివ్ స్పందన కూడా అతడికి కలిసొచ్చే అంశంగా మారింది. రామ్ ప్రసాద్ కూడా పోటీలో నిలుస్తుండటంతో టాప్ స్థానాల కోసం పోరు ఆసక్తికరంగా మారింది.
►ALSO READ | Crazy Kalyanam Movie Review: 'క్రేజీ కళ్యాణం' రివ్యూ: తండ్రీకూతుళ్ల ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?
వర్షిణికి ఈసారి షాక్ తప్పదా?
ఇక వర్షిణి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా కనిపిస్తోంది. గతంలోనూ డేంజర్ జోన్‌కు చేరుకున్న ఆమె.. ఈసారి మళ్లీ తక్కువ ఓటింగ్ అంచనాల మధ్య చిక్కుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకసారి మిడ్‌వీక్ ఎలిమినేషన్లతో ఊరట లభించగా.. మరోసారి ముకేష్ తన కార్డు ఉపయోగించడంతో ఆమెకు ఊరట లభించింది. కానీ ఇప్పుడు మళ్లీ నామినేషన్స్‌లో ఉండటంతో ఆమె ప్రయాణంపై సందేహాలు పెరిగాయి.
అమన్, షాలినిలతో పాటు వర్షిణి కూడా తక్కువ ఓటింగ్ అంచనాల మధ్య పోటీపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఆరోవారం ఎవరు హౌస్‌ను వీడతారు? షాలినికి బిగ్ బాస్ మరో అవకాశం ఇస్తారా? లేక వర్షిణి ప్రయాణం ముగుస్తుందా? లేక అమన్‌కు షాక్ తప్పదా? ఆన్లైన్ పోల్స్ కేవలం అంచనాలే కావడంతో అసలు ఫలితం అధికారిక ఎలిమినేషన్ ఎపిసోడ్‌లోనే తేలనుంది.
