దుబాయ్: సౌదీ అరేబియా రాజధాని రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడి నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) శుక్రవారం తాజాగా మరో అడ్వైరీ జారీ చేసింది. అత్యవసర సమయాల్లో స్థానిక అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలని, వైమానిక దాడులు జరిగే సమయంలో ఇండ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేసింది.
రియాద్ ఎయిర్పోర్ట్ మూసివేయడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవస రంగా స్వదేశానికి రావాలనుకునే భారతీయులు తగిన వీసాలు కలిగి ఉంటే బహ్రెయిన్, కువైట్ లేదా ఖతార్ మీదుగా ప్రయాణించాలని ఎంబసీ సూచించింది.
