హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వాహనాల ఫిట్నెస్ పరీక్షలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 425. 50 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో స్టేషన్ వ్యయాన్ని రూ.8 కోట్ల నుంచి రూ. 11.50 కోట్లకు పెంచుతూ అనుమతులు మంజూరు చేసినట్లు శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
మొదటి దశలో 15 స్టేషన్లు, ఇందులో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 స్టేషన్లు, రెండో దశలో మిగిలిన 22 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
