ప్రభుత్వ తప్పులను ఎండగట్టడమే మా పని..ఓట్ చోర్, గద్దీ ఛోడ్.. వ్యవస్థను మార్చడమే తమ లక్ష్యం: జైరాం రమేశ్

ప్రభుత్వ తప్పులను ఎండగట్టడమే మా పని..ఓట్ చోర్, గద్దీ ఛోడ్.. వ్యవస్థను మార్చడమే తమ లక్ష్యం: జైరాం రమేశ్

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందిస్తూ.. ప్రతిపక్షాల పాత్ర గురించి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాటలను గుర్తుచేశారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రధాన బాధ్యత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం, తప్పులను ఎండగట్టడం, ప్రభుత్వాన్ని గద్దె దించడం’ అని ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడూ చెబుతుండేవారని అన్నారు. 

దేశంలో తాము ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’  అనే ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని.. వ్యవస్థను మార్చాలన్నదే తమ స్పష్టమైన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం.. మార్చాలని కోరడం ప్రతిపక్షాల హక్కు అని, దాన్ని అరాచకంగా చిత్రీకరించడం సరికాదని కౌంటర్ ఇచ్చారు.