వారం తర్వాత వీకెండ్ పెరిగిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే?

వారం తర్వాత వీకెండ్ పెరిగిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే?

గడచిన వారం రోజులుగా నెమ్మదించిన బంగారం ధరలు వారాంతంలో దసరా పండుగకు ముందు మళ్లీ పెరగటం తిరిగి స్టార్ట్ అయ్యింది. దీంతో బంగారం షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్కున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లో తగ్గిన రిటైల్ ధరలను పరిశీలించటం బెటర్.

అక్టోబర్ 17న బంగారం రేట్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.22 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 766గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 535గా కొనసాగుతోంది. 

ALSO READ : రష్యన్ ఆయిల్ టారిఫ్స్‌పై ట్రంప్ యూటర్న్.. భారత్‌కు భారీ ఊరట!

శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 17, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 40వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.240 దగ్గర ఉంది.