Vijay Deverakonda Ranabaali: ‘రణబాలి’కి పాజిటివ్ టాక్.. ఆడియన్స్‌ను కనెక్ట్ చేస్తున్న అంశాలివే..

Vijay Deverakonda Ranabaali: ‘రణబాలి’కి పాజిటివ్ టాక్.. ఆడియన్స్‌ను కనెక్ట్ చేస్తున్న అంశాలివే..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో పరిస్థితులు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ.. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఇలాంటి సమయంలో గతంలో చోటుచేసుకున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించే కథాంశాలతో తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఇదే తరహా చర్చ ‘రణబాలి’ చుట్టూ సాగుతోంది.

అప్పటి పరిస్థితులు.. ఇప్పటి ఆందోళనలు..

ప్రకృతిలో చోటుచేసుకునే మార్పులు మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి? వాతావరణ పరిస్థితులు సమాజంపై ఎలాంటి ముద్ర వేస్తాయి? ఇలాంటి అంశాలను తెరపై ఆవిష్కరించే కథలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

ప్రస్తుతం ఎల్‌నినో పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ‘రణబాలి’లో చూపించిన పరిస్థితులు ఆడియన్స్ కళ్ళకు అద్దంపడుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు ప్రతిఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూస్తూ.. ఒక మనిషి జీవితంలో నీళ్లు, కరెంట్, ఆహారం ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తాయో అర్ధం చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. అప్పటి బ్రిటిష్ అధికారులు తమని ఎంతలా కట్టు బానిసలుగా చేసుకున్నారో ఊహించుకుంటున్నారు. 

‘రణబాలి’కి పాజిటివ్ టాక్.. విజయ్ దేవరకొండకు బిగ్ బూస్ట్..

విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తేనే యూత్‌లో ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే+దు. అయితే, ఒక నటుడి కెరీర్‌లో కొన్ని సినిమాలు కేవలం బాక్సాఫీస్ లెక్కలకే పరిమితం కావు. అతడి ఇమేజ్‌ను మార్చడంతో పాటు, ప్రేక్షకుల్లో కొత్త అంచనాలను కూడా క్రియేట్ చేస్తాయి. అలాంటి సినిమా ‘రణబాలి’ అవుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఇదే టాక్ బలపడితే మాత్రం విజయ్ దేవరకొండకు అది గట్టి బూస్ట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇదే క్రమంలో  విజయ్ దేవరకొండకు ఇది సాలిడ్ కమ్‌బ్యాక్ అవుతుందనే అంచనాలు జోరందుకుంటున్నాయి.

రణబాలి’ కథేంటి? 

1858 నాటి రాయలసీమ నేపథ్యంలో ‘రణబాలి’ కథ సాగుతుంది. అప్పట్లో బ్రిటిష్ పాలకులు విధించిన భారీ పన్నులు, రైతుల భూముల స్వాధీనం, కరువు పరిస్థితులు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తాయి. కష్టపడి పంటలు పండించినా తగిన ఫలితం లేక, అటు పన్నుల భారం.. ఇటు ఆకలి బాధలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల కష్టాలను చూసి చలించిపోయే యోధుడు సింగనమల బొబ్బిలి రణబాలి. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, బ్రిటిష్ అధికారుల అణచివేతకు ఎదురొడ్డి నిలబడతాడు. ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యంగా పోరాట బాట పడతాడు. ఈ క్రమంలో రణబాలి ఎదుర్కొనే సవాళ్లు, అతడి తిరుగుబాటు కథలో ప్రధానంగా కనిపిస్తాయి. రణబాలి జీవితంలో జయమ్మ పాత్ర కూడా ముఖ్యమైనది. రష్మిక మందన్న పోషించిన ఈ పాత్ర కథకు ప్రేమను, భావోద్వేగాలను జోడిస్తుంది. ప్రజల కోసం సాగించే పోరాటం, వ్యక్తిగత జీవితంలోని అనుబంధాలు.. ఈ రెండింటి మధ్య కథ ముందుకు సాగుతుంది.

దర్శకుడు ఈ కథను కేవలం యాక్షన్ సన్నివేశాలకే పరిమితం చేయకుండా, అప్పటి ప్రజల జీవన పరిస్థితులను కూడా ఆవిష్కరించేలా రూపొందించారు. రైతుల కష్టాలు, కరువు ప్రభావం, బ్రిటిష్ పాలనలో సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలకు కథలో చోటు కల్పించారు. దీంతో ‘రణబాలి’లో ఓ యోధుడి పోరాటంతో పాటు, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడిన ప్రజల జీవితాలు కూడా కీలకంగా మారతాయి.

ALSO READ :  పెళ్లికి ముందే బిడ్డను కనాలనుంది..