న్యూజిలాండ్ టూర్‎కు భారత వన్డే, టెస్ట్ జట్ల ప్రకటన.. సీనియర్లకు మళ్లీ నిరాశే..!

న్యూజిలాండ్ టూర్‎కు భారత వన్డే, టెస్ట్ జట్ల ప్రకటన.. సీనియర్లకు మళ్లీ నిరాశే..!

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే, టెస్ట్ జట్లను బీసీసీఐ ప్రకటించింది. ప్రజ్ఞన్ ఓజా నేతృత్వంలోని తాత్కాలిక సెలక్షన్ కమిటీ శుక్రవారం (అక్టోబర్ 16) వన్డే, టెస్ట్ సిరీస్‎లకు వేర్వేరు జట్లను అనౌన్స్ చేసింది. ఐదు వన్డేల సిరీస్‎లో తొలి మూడు మ్యాచులకు శుభమన్ గిల్ కెప్టెన్‎గా వ్యవహరించనుండగా.. మిగిలిన చివరి రెండు వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ జట్టును నడిపించనున్నాడు. వన్డే సిరీస్ ముగిసిన వెంటనే టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటగాళ్లపై పని భారం పడకుండా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

టెస్ట్ సిరీస్‎కు గిల్ కెప్టెన్‎గా ఎంపిక కాగా.. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‏గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. వెస్టిండీస్‎తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను వన్డే జట్టు నుంచి తప్పించారు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

టీమిండియాలో పునరాగమనం కోసం సుధీర్ఘ కాలంగా ఎదురు చూస్తోన్న సీనియర్ బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీకి మరోసారి సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు. వన్డే, టెస్ట్ రెండు సిరీస్‎లకు ఈ ఇద్దరు సీనియర్లను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, అతని ఎంపిక మెడికల్ క్లియరెన్స్ (ఫిట్‌నెస్) పై ఆధారపడి ఉంటుంది. ఇక, గాయం నుంచి కోలుకున్న పేసర్ ఆకాశ్ దీప్ టెస్ట్ జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు. 

భారత క్రికెట్ జట్టు అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1, 2026 వరకు న్యూజిలాండ్‌లో సుదీర్ఘ పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి.

తొలి మూడు వన్డేల కోసం భారత వన్డే జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ (ఫిట్‌నెస్ ఆధారంగా), కుల్దీప్ యాదవ్.

చివరి రెండు (4, 5) వన్డేల జట్టు 

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్ & వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్

భారత టెస్టు జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్ - ఫిట్‌నెస్ ఆధారంగా), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.