జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం... రెండు కార్లు, ఒక బైక్ ఢీకొని.. ఇద్దరు మృతి..

జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం... రెండు కార్లు, ఒక బైక్ ఢీకొని.. ఇద్దరు మృతి..

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు బైక్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ( అక్టోబర్ 16 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని వెల్గటూరు మండలం కప్పరావుపేట గ్రామం దగ్గర జరిగింది ఈ ప్రమాదం.రెండు కార్లు, ఒక బైక్ ఢీకొన్న ఘటనలో కారు నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా.. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఛాత రాజుల కొమురయ్య, మరొకరు ముల్కల శ్రీనుగా గుర్తించారు. మృతులు కిషన్ రావు పేట గ్రామానికి చెందినవారని తెలుస్తోంది.

ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.