యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆక్సీ-నౌ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్ డెడ్, ఇద్దరికి సీరియస్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆక్సీ-నౌ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్ డెడ్, ఇద్దరికి సీరియస్

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రీస్ పార్క్‌లోని ఆక్సీ-నౌ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. శుక్రవారం (అక్టోబర్ 16) ఫ్యాక్టరీలో ఒక్కసారిగా ఆక్సిజన్ సిలిండర్లు పేలాయి. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ పేలుడుతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. 

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ కార్మికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన మనీష్ కుమార్‎గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.