హైదరాబాద్: సర్ ప్రక్రియ ద్వారా ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని.. పట్టభద్రులు అందరూ తమ ఓటును నమోదు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సర్ పేరిట జరుగుతున్న కుట్రలను పట్టభద్రులు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం (అక్టోబర్ 17) గాంధీ భవన్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సన్నాహక సమావేశం జరిగింది.
హైదరాబాద్ ఇంచార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్రోల్ మెంట్కు సంబంధించి నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని హైదరాబాద్ జంట నగరాలలో ఉన్న పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.
ALSO READ : సిద్దిపేటలో కేసీఆర్ 12 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టారు... మా ప్రభుత్వం వచ్చాక 12 వేల ఇందిరమ్మ ఇళ్ళు కట్టాం
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉద్యోగ, న్యాయవాదుల, టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామా రామ్మోహన్ రెడ్డి గెలుపుకు సహకరించాలని కోరారు. పట్టభద్రుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.
