ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కు మద్దతివ్వండి ..సీపీఎంను కోరిన పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌‌‌‌‌, మంత్రి పొన్నం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కు మద్దతివ్వండి ..సీపీఎంను కోరిన పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌‌‌‌‌, మంత్రి పొన్నం
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ముఖ్య నేతలతో భేటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను కాంగ్రెస్ నాయకులు కోరారు. శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ వేంనరేందర్ రెడ్డి వెళ్లారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యద‌‌‌‌‌‌‌‌ర్శి వ‌‌‌‌‌‌‌‌ర్గ స‌‌‌‌‌‌‌‌భ్యులు టి.జ్యోతి, టి.సాగ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌, పోతినేని సుద‌‌‌‌‌‌‌‌ర్శన్‌‌‌‌‌‌‌‌రావు, బండారు ర‌‌‌‌‌‌‌‌వికుమార్‌‌‌‌‌‌‌‌తో  భేటీ అయ్యారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తో కలిసి రావాలని, రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ స్పందిస్తూ తమ పార్టీ పొలిట్ బ్యూరో, రాష్ట్ర కమిటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మిగిలిన వామపక్ష పార్టీలతోనూ చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి వామపక్షాల మద్దతుతో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ రెండు పర్యాయాలు విజయం సాధించిన అంశాన్ని గుర్తు చేశారు.  

ఐక్యతతోనే ముందుకెళ్తాం: పీసీసీ చీఫ్ 

దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం సహా ఇండియా కూటమి పార్టీలన్నీ ప్రజా సమస్యలు, ఎస్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌పై కలిసికట్టుగా పోరాడుతున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోనూ వామపక్షాల మద్దతుతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీపీఎంను కోరామని పేర్కొన్నారు

ఎల్‌‌‌‌‌‌‌‌నినోపై ప్రజలను చైతన్య పర్చాలి

ఎల్‌‌‌‌‌‌‌‌నినోపై ప్రజలను భయపెట్టడం కాదు, వారిని చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు మహేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ సూచించారు. ఈ మేరకు శుక్రవారం బహిరంగ లేఖను విడుదల చేశారు. రైతులను కాపాడడం మన కర్తవ్యమని, తెలంగాణలో నీటిని పొదుపుగా వాడేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జులు గ్రామాల్లో పర్యటించాలన్నారు. గ్రామస్థాయిలో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, నీటి లభ్యత ఉన్న ఇతర ప్రదేశాలను సందర్శించి సమీక్షించాలని చెప్పారు.