- 48 మంది అనుమానితులు అదుపులోకి..
- స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనార్
బషీర్బాగ్, వెలుగు : హైదరాబాద్ లో గురువారం అర్ధరాత్రి నుంచి ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో తెల్లవారుజాము వరకు ‘ఆపరేషన్కవచ్’ పేరిట నాకాబందీనిర్వహించారు. 100కు పైగా టీమ్లతో 3 వేల మంది పోలీసు సిబ్బంది పాల్గొనగ..సీపీ సజ్జనార్స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పత్రాలు సరిగ్గా లేని 725 వాహనాలను డిటైన్ చేయడంతోపాటు 48 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఐదు మైనర్ డ్రైవింగ్ కేసులు, రెండు గంజాయి కేసులు, ఒక వెపన్కు సంబంధించిన కేసుతోపాటు పలు ఇతర కేసులు నమోదు చేశారు.
నడుస్తూ..తనిఖీ చేస్తూ..
సీపీ సజ్జనార్...చంద్రాయణగుట్టలో నడుస్తూ వాహన తనిఖీలను పరిశీలించారు. మైలార్దేవ్పల్లి మెహఫిల్ హోటల్, శంషాబాద్ సతమ్రాయ్, అత్తాపూర్ పరిధిలోని హైదర్గూడ పిల్లర్ నంబర్ 133 వద్ద, బండ్లగూడ, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో తనిఖీలను సమీక్షించారు. చాలా మంది నంబర్ ప్లేట్లను మారుస్తున్నారని, నంబర్లు కనిపించకుండా ప్లేట్లను వంచుతున్నారని ..ఇలాంటి పనులు చేస్తే చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అడిషనల్సీపీలు ఎం.శ్రీనివాసులు, తఫ్ఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ డి.జోయల్ డెవిస్ పాల్గొన్నారు.
