గాల్లో ఎగిరి, తలక్రిందులుగా తిరిగి సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్.. ఆ యుద్ధ విమానాల స్పూర్తితో డిజైన్!

గాల్లో ఎగిరి, తలక్రిందులుగా తిరిగి సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్.. ఆ యుద్ధ విమానాల స్పూర్తితో డిజైన్!

ఫ్యూచరిస్టిక్ కార్లను తలపించేలా టెస్లా మరోసారి సంచలనం సృష్టించింది. 1962 నాటి 'ది జెట్సన్స్' కార్టూన్ సిరీస్‌ను తలపించే రీతిలో నెక్స్ట్-జనరేషన్ టెస్లా రోడ్‌స్టర్ చేసిన విన్యాసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దాదాపు 9 ఏళ్ల క్రితం తొలిసారి పరిచయం చేసిన ఈ రోడ్‌స్టర్.. తాజాగా ఓ భారీ కర్వ్‌డ్ రాంప్ పైకి దూసుకెళ్లి.. పూర్తిగా తలక్రిందులుగా ట్రాక్‌పై ప్రయాణించి, గాలిలోకి ఎగిరి ఎలాంటి అవాంతరాలు లేకుండా టైర్లపై సేఫ్‌గా ల్యాండ్ అయి అద్భుతం సృష్టించింది. ఎస్‌ఆర్‌-71, ఎఫ్‌-35 యుద్ధ విమానాల స్ఫూర్తితో ఈ రోడ్‌స్టర్‌ను అత్యాధునిక డిజైన్‌తో తీర్చిదిద్దినట్లు టెస్లా చెబుతోంది. 

మరోవైపు భారతీయ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని ఫ్యామిలీ-ఫోకస్డ్ 'మోడల్ వై ఎల్' ఎస్‌యూవీకి అదిరిపోయే అప్‌గ్రేడ్ అందించింది. ఇందులో కాంప్లిమెంటరీ యాక్సిలరేషన్ బూస్ట్ ద్వారా దీని 0-100 కిమీ వేగాన్ని కేవలం 4.5 సెకన్లలోనే అందుకునేలా అప్‌డేట్ చేశారు. అంతేకాకుండా ఇది సింగిల్ చార్జ్‌పై ఏకంగా 681 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. గ్లోబల్ సేఫ్టీ రేటింగ్స్‌లో ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ, యూరో ఎన్‌క్యాప్, ఏఎన్‌సీఏపీ వంటి ప్రముఖ సంస్థల నుంచి అత్యుత్తమ రేటింగ్స్ సాధించిన ఈ వాహనాలు భారతీయ రోడ్లపై భద్రతకు పెద్దపీట వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 20 సూపర్‌చార్జర్ స్టాల్స్, 28 డెస్టినేషన్ చార్జర్ స్టాల్స్‌తో పాటు 23 రాష్ట్రాల్లో హోమ్-చార్జింగ్ సదుపాయాన్ని టెస్లా విస్తరించింది. 2026 చివరి నాటికి మరో 3 కొత్త చార్జింగ్ కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

భారత మార్కెట్లో టెస్లా మోడల్ వై ప్రారంభ ధర రూ.50లక్షల 89వేలు ఉండగా, రూ. 6లక్షల డౌన్‌పేమెంట్ చెల్లించి నెలకు రూ. 39వేల 990 ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. అలాగే మోడల్ వై ఎల్ ధర రూ. 61లక్షల 99వేల నుంచి ప్రారంభమవుతుంది. దీనికి రూ. 6లక్షల 50వేలు డౌన్‌పేమెంట్ చెల్లించి.. 7 సంవత్సరాల కాలపరిమితికి 8.5% ఏపీఆర్ స్టెప్-అప్ ప్లాన్‌తో నెలకు రూ.49వేల 990 ఈఎంఐ ఎంచుకోవచ్చు. దీనితో పాటు 'రెఫర్ అండ్ అర్న్' ప్రోగ్రామ్ ద్వారా పాత కస్టమర్లకు రూ.11వేల క్రెడిట్స్, కొత్త కొనుగోలుదారులకు రూ. 22వేలు డిస్కౌంట్ అందిస్తోంది టెస్లా.

టెస్లా 2026 మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్, మోడల్ వై ఎల్ వాహనాల టెస్ట్ డ్రైవ్ కోసం ఆసక్తి గల వారు tesla.com వెబ్‌సైట్ ద్వారా లేదా 1800-203-1538 టోల్-ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. నోయిడా, ఢిల్లీ, గురుగ్రామ్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబైల్లోని ఎక్స్‌పీరియన్స్ సెంటర్లతో పాటు పూణే, అహ్మదాబాద్‌లోని ఆథరైజ్డ్ కొలిజన్ కేంద్రాల్లోనూ వీటిని పరిశీలించవచ్చు ఆటో లవర్స్.