కోట్‎పల్లి MRO ఆఫీస్‎లో డీజిల్ పోసుకుని రైతుల ఆత్మహత్యాయత్నం

కోట్‎పల్లి MRO ఆఫీస్‎లో డీజిల్ పోసుకుని రైతుల ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: ఎమ్మార్వో కార్యాలయంలో రైతులు డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోట్‎పల్లి తహశీల్దార్ కార్యాలయంలో డీజిల్ పోసుకుని రైతులు ఆత్మహత్నాయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు రైతుల దగ్గర ఉన్న డీజిల్ బాటిల్ తీసుకుని అడ్డుకున్నారు.

తమ తాతల ఆస్తీ 12 ఎకరాల భూమి నలుగురికి మూడు ఎకరాల చొప్పన రావాల్సి ఉండగా.. అక్రమంగా ఒక్కరికే ఆరు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమ భూమిలోకి వెళ్లకుండా కోట్‎పల్లి  పోలీసులు బైండోవర్ కేసులు పెట్టారని ఆరోపించారు. న్యాయబద్దంగా తమకు రావాల్సిన భూమి ఇప్పించాలని అధికారులను కోరారు. ఎమ్మార్వో కార్యాలయంలోకి రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.