హైదరాబాద్, వెలుగు: ఐరో ఎసెన్షియల్స్ అండ్ హెల్త్ హబ్ కొత్త స్టోర్ను హైదరాబాద్లో నటి నిధి అగర్వాల్ శనివారం ప్రారంభించారు. ఇక్కడ కిరాణా సరుకులు, తాజా పండ్లు, కూరగాయలు, వెల్నెస్ ఉత్పత్తులు, ఫార్మసీ సేవలు, ముందస్తు ఆరోగ్య పరీక్షల వంటి సేవలు లభిస్తాయి.
ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచేందుకు తమ స్టోర్లలో లక్ష ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తామని ఐరో ప్రకటించింది. సరైన పోషకాహారం, నాణ్యమైన ఉత్పత్తులతో ప్రతి కుటుంబానికి ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించడమే తమ లక్ష్యమని తెలిపింది.
