ఎల్బీనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

ఎల్బీనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడకు వెళ్తున్న బస్సును వెనుక నుంచి స్కూటీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మహేష్, శివ అనే యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.

 విజయవాడకు వెళ్తున్న బస్సును స్కూటీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.