చెన్నై: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్), సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనలకు డీఎంకే పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే, ఇదే అంశంపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. శనివారం చెన్నైలో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే ఎంపీల సమావేశం జరిగింది.
నేశ్ను సీఈసీ పదవి నుంచి తొలగించాలని, సర్ రద్దు చేసి మళ్లీ బ్యాలెట్ పేపర్లను పునరుద్ధరించాలని సమావేశం తీర్మానించింది. అలాగే, ఓటర్ జాబితా సవరణపై కాంగ్రెస్, అధికార టీవీకే పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని ఆరోపించింది. అలాగే, ప్రస్తుతం 'ఇండియా' కూటమికి దూరంగా ఉంటున్న డీఎంకే..సీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి కొత్తగా మూడో కూటమిని ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
