వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ లో అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌ పరీక్ష హాల్‌‌‌‌‌‌‌‌ టికెట్లు

వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ లో అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌ పరీక్ష హాల్‌‌‌‌‌‌‌‌ టికెట్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌ (ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌ గ్రేడ్‌‌‌‌‌‌‌‌–2) పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష హాల్‌‌‌‌‌‌‌‌టికెట్లను  టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్‌‌‌‌‌‌‌‌టికెట్లను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి హరిత తెలిపారు.

శనివారం నుంచి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే హాల్‌‌‌‌‌‌‌‌టికెట్లు కమిషన్‌‌‌‌‌‌‌‌ అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా అభ్యర్థులు ముందుగానే హాల్‌‌‌‌‌‌‌‌టికెట్లను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని సూచించారు. కాగా, ఈనెల 24న ఆన్​లైన్​పరీక్ష ఉంది.