హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ యువతకు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలను తక్షణమే అమలు చేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. శనివారం గన్పార్క్ వద్ద బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ కుండే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తోందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతను ఓట్లు అడిగే ముందు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారో తేల్చాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతిని వెంటనే అందించాలని, జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని వేగవంతం చేయాలని కోరారు.
