ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్

ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్ ను వెంటనే చెల్లించాలని ఎండీ నాగిరెడ్డి  శనివారం అధికారులను ఆదేశించారు. ఆర్టీసీలోని క్లాస్ 3, 4 ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు. ఈ అడ్వాన్స్ మొత్తాన్ని కార్మికులు మొత్తం పది ఈఎంఐల రూపంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సెప్టెంబర్ నుంచి ఇది అమలవుతుందని అందులో స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్ చెల్లించేలా చర్యలు తీసుకున్న రవాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కు , ఎండీ నాగిరెడ్డికి ఎన్ఎంయూ నేత కమలాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.