ఈఐ బోర్డు సభ్యుడిగా కత్తి నరసింహారెడ్డి

ఈఐ బోర్డు సభ్యుడిగా కత్తి నరసింహారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ (ఈఐ) ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్టీఎఫ్) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో అక్టోబర్ 11 నుంచి 15 వరకు 40 దేశాల ప్రతినిధులతో జరిగిన అంతర్జాతీయ విద్యా సదస్సులో ఆయన ఈ విజయం సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు ఈ గుర్తింపు దక్కడం భారతీయ ఉపాధ్యాయ రంగానికి గర్వకారణమని నేతలు తెలిపారు.

శనివారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆ సంఘం నేతలు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏఐఎస్టీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్, యూటీఎఫ్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టు గజేందర్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమ బలోపేతానికి, సమస్యల పరిష్కారానికి నరసింహారెడ్డి అందించిన విశేష సేవలకు ఈ పదవి నిదర్శనమని కొనియాడారు.