భక్తులపైకి దూసుకెళ్లి ట్రక్కు..స్పాట్ లోనే 12మంది ప్రాణాలు కోల్పోయారు..గ్వాలియర్ లో దుర్ఘటన

భక్తులపైకి దూసుకెళ్లి ట్రక్కు..స్పాట్ లోనే 12మంది ప్రాణాలు కోల్పోయారు..గ్వాలియర్ లో దుర్ఘటన

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్వాలియర్ లో ఓ ఆలయం సమీపంలో  ట్రక్కు అదుపు తప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ  ప్రమాదంలో  12 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి.ఆదివారం(అక్టోబర్18) తెల్లవారుజామున గ్వాలియర్ లోని శీతలా మాత ఆలయం సమీపంలో  ఈదుర్ఘటన జరిగింది. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రక్కు నిటారు వాలు రోడ్డుపై  అదుపు తప్పి పోలీస్ చెక్ పోస్టును, అనంతరం ఆలయ గేటును, బయటి గోడను ఢీకట్టింది. 

స్థానిక పోలీసులు వివరా ల ప్రకారం.. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శీతలా మాత ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  రోడ్డు పక్కనే ఆలయం ఉండటంతో టక్కు ఆలయం, భక్తులపై దూసుకెళ్లింది. పోలీసు బారికేడ్లను ఢీకొట్టి అదుపుతప్పిన ట్రక్కు కిందకు వచ్చి ఆలయం బయటి గోడను, గేటును ఢీకొట్టింది. రోడ్డుపై ఉన్న భక్తులు దాని కింద నలిగిపోయారని స్థానిక పోలీసులు తెలిపారు. గాయపడిన 39 మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు.