3.3 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు ..ఆర్టీఏ అధికారుల వెల్లడి

3.3 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు ..ఆర్టీఏ అధికారుల వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో 3.3 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయని రవాణాశాఖ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలో 2024లో రోడ్డు ప్రమాదాల కారణంగా 7,949 మంది ప్రాణాలు కోల్పోగా, 2025 నాటికి ఆ సంఖ్య 7,687కి తగ్గిందని అధికారులు తెలిపారు.

ఒక్క ఏడాదిలోనే 262 మరణాలు తగ్గాయని.. ఇది 3.3శాతం తగ్గుదలగా నమోదైనట్టు అధికారులు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ తరఫున నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ, వాహనదారుల్లో భద్రతా ప్రమాణాలపై చైతన్యం తేవడం వల్లే ఈ సానుకూల ఫలితాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు.