- మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి
రాయికల్, వెలుగు : అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల వద్ద రూ.300 కోట్లు వెచ్చించి కాఫర్ డ్యాంలు నిర్మిస్తే ఈ యాసంగి సీజన్లో పంటల ద్వారా రూ.30 వేల కోట్ల ఆదాయం సాధించవచ్చని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. శనివారం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేశ్, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కటకం రవీందర్, పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తున్నానని, తాను ఎప్పుడూ ప్రజల పక్షానే మాట్లాడుతున్నానని తెలిపారు.
కాఫర్ డ్యాంల నిర్మాణం చేపట్టి నెల రోజుల్లో అన్నారం, సుందిళ్ల వద్ద పనులు పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల శాఖ నివేదిక సమర్పించి రెండు నెలలు గడిచినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎస్సారెస్పీ నీటి సరఫరాను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
