మేక్ ఇన్ ఇండియా బాటలో లాజిటెక్

మేక్ ఇన్ ఇండియా బాటలో లాజిటెక్


హైదరాబాద్​, వెలుగు: టెక్‌ సంస్థ లాజిటెక్ భారత్‌లో తన తయారీ కార్యకలాపాలను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా నినాదానికి మద్దతుగా హర్యానాలోని మనేసర్‌‌లో దేశీయ భాగస్వాములతో కలిసి ఉత్పత్తుల అసెంబ్లింగ్ మొదలుపెట్టింది.  

ఇప్పటికే చెన్నైలో లాజిటెక్ కు ఆర్ అండ్ డీ కేంద్రం ఉంది.  మనేసర్ ప్లాంట్ ద్వారా తొలుత  వెబ్ క్యామ్‌లు, మౌస్ వంటి పాయింటింగ్ డివైజ్‌లను తయారు చేయనున్నారు.