ఉపాధి దొరికేలా కోర్సుల సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చాలి : ఓయూ వీసీ ప్రొ.కుమార్ మొలుగరం

ఉపాధి దొరికేలా కోర్సుల సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చాలి : ఓయూ వీసీ ప్రొ.కుమార్ మొలుగరం

హైదరాబాద్ సిటీ, వెలుగు: మారుతున్న మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిస్థితులు, విద్యార్థులకు ఉపాధి దొరికేలా యూజీ, పీజీ కోర్సుల సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చాలని ఓయూ వీసీ ప్రొఫెసర్​కుమార్ మొలుగరం అన్నారు.  శనివారం వర్సిటీ పరిపాలనా భవనంలో వివిధ ఫ్యాకల్టీలు, హెచ్​వోడీలు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్లతో నిర్వహించిన అకడమిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. స్టూడెంట్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షల ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. 

ముఖ్యంగా పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ కోర్సు వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రీసెర్చ్ మెథడాలజీ, ఎథిక్స్, ఏఐ బ్రాడ్ ఏరియా ఆఫ్ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కూడిన12  క్రెడిట్ల నూతన విధానాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదనపై చర్చించారు.  యాప్ ఆధారిత ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ హాజరు నమోదును వీలైనంత త్వరగా అమలు చేయాలని సూచించారు.