తాగునీటికే తొలి ప్రాధాన్యం..యాసంగిలో వరిసాగు చేయొద్దు : కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ మహేష్ దత్

తాగునీటికే తొలి ప్రాధాన్యం..యాసంగిలో వరిసాగు చేయొద్దు : కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ మహేష్ దత్
  •     ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్​ ఆఫీసర్​మహేష్ దత్

కరీంనగర్, వెలుగు: సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో తాగునీరు, విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాగునీటి అవసరాలపై ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని, తాగునీటికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని ఉమ్మడి కరీంనగర్​ జిల్లా ప్రత్యేక అధికారి బెన్హర్​ మహేష్​ దత్​ ఎక్కా ఆఫీసర్లకు సూచించారు. యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శనివారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాల కలెక్టర్లు చిత్రా మిశ్రా, బి.సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోయ శ్రీహర్ష, గరీమ అగర్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. 

వ్యవసాయం, విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాగునీరు, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, నీటి సంరక్షణ, ఉపాధి హామీ, అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనుల పురోగతిపై ఆఫీసర్లు వివరాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్పెషల్​ ఆఫీసర్​ మాట్లాడుతూ గోదావరి, కృష్ణా నదుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండేలా గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు. తక్కువ నీటితో, తక్కువ వ్యవధిలో పండే పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అదనపు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అశ్వినీ తానాజీ, వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.