అడ్వాన్స్ టెక్నాలజీతో విరిగిన ఎముకల ఆపరేషన్లు..

అడ్వాన్స్ టెక్నాలజీతో విరిగిన ఎముకల ఆపరేషన్లు..
  • ‘ఆర్థో పెడిక్ ట్రామా సమిట్’లో నావిగేషన్ రోబోటిక్ పై చర్చ

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో శనివారం జరిగిన ‘ఆర్థో పెడిక్ ట్రామా సమిట్ 2026’లో ఎముకల విరుగుళ్లు, సంక్లిష్ట కీళ్ల గాయాలకు మెరుగైన చికిత్స అందించే ఆధునిక టెక్నాలజీపై చర్చించారు. మాదాపూర్ లోని హైటెక్స్  వేదికగా జరిగిన సదస్సులో  బ్రిటన్, ఇజ్రాయెల్, థాయ్‌‌లాండ్, దక్షిణ కొరియా దేశాలకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ వైద్య నిపుణులతోపాటు దేశంలోని 75 మందికి పైగా ఆర్థోపెడిక్ సర్జన్లు పాల్గొన్నారు.

ప్రీ -కాన్ఫరెన్స్ డ్రై లాబ్‌‌లు, నిపుణుల చర్చలు, సంక్లిష్ట కేసులతోపాటు ట్రామా రోబోటిక్ వ్యవస్థల పనితీరును ప్రదర్శించారు. ఆపరేషన్లలో టెక్నాలజీని ఏ విధంగా వినియోగించాలనే దానిపై డాక్లర్లకు అవేర్ నెస్ కల్పించారు. ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రతినిధులు, 120 మందికి పైగా వైద్య నిపుణులు హాజరయ్యారు.   రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్‌‌ కాశా తెలిపారు.