ఈఆర్సీ రాష్ట్ర సలహా కమిటీ పునర్ వ్య వస్థీకరణ ..21 మంది సభ్యులతో ఏర్పాటు 

ఈఆర్సీ రాష్ట్ర సలహా కమిటీ పునర్ వ్య వస్థీకరణ ..21 మంది సభ్యులతో ఏర్పాటు 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీ ఈఆర్సీ) రాష్ట్ర సలహా కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ చట్టం-2003 సెక్షన్ 87 ప్రకారం మూడేండ్ల కాలపరిమితితో, అక్టోబర్ 16 నుంచి అమల్లోకి వచ్చేలా మొత్తం 21 మంది సభ్యులతో ఈ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఈఆర్సీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్ ఎక్స్-అఫీషియో చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనుండగా, కమిషన్ సెక్రటరీ వి. రాంచందర్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

విద్యా-పరిశోధన, స్వచ్ఛంద సంస్థలు, వాణిజ్యం, వ్యవసాయం, వినియోగదారులు, కార్మిక సంఘాలు, పరిశ్రమలు,  రవాణా వంటి వివిధ రంగాల ప్రతినిధులకు ఈ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించారు. సీనియర్ జర్నలిస్ట్ ఎం. వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే పి. శశిధర్ రెడ్డి, గ్రీన్ రెవల్యూషన్ సలహాదారు దొంతి నర్సింహారెడ్డి, ఓయూ, జేఎన్టీయూ మాజీ వైస్ చాన్సలర్ డి. నరసింహారెడ్డి తదితర ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. విద్యుత్ చట్టం-2003 సెక్షన్ 88 ప్రకారం ప్రభుత్వ ప్రధాన విధానాలు, విద్యుత్ సేవల నాణ్యత, లైసెన్సుదారుల నిబంధనల అమలు, వినియోగదారుల ప్రయోజనాల రక్షణ, విద్యుత్ సరఫరా ప్రమాణాలపై నియంత్రణ మండలికి ఈ కమిటీ తగిన సలహాలు, సూచనలు అందించనుంది.