కొటెక్నా చేతికి హైదరాబాద్కు చెందిన ఎనర్గాన్ ల్యాబ్స్

కొటెక్నా చేతికి  హైదరాబాద్కు చెందిన ఎనర్గాన్ ల్యాబ్స్

హైదరాబాద్​, వెలుగు: టెస్టింగ్, ఇన్‌స్పెక్షన్, సర్టిఫికేషన్ సేవలు అందించే కొటెక్నా గ్రూప్, హైదరాబాద్‌కు చెందిన ఎనర్గాన్ ల్యాబ్స్‌ను కొనుగోలు చేసింది. ఎనర్గాన్ ల్యాబ్స్ యూఎస్ఎఫ్‌డీఏ తనిఖీ చేసిన, సీజీఎంపీ, ఐఎస్ఓ సర్టిఫికేషన్లు పొందిన  అనలిటికల్ టెస్టింగ్ లాబొరేటరీ. ఈ కొనుగోలుతో ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్, బయోఫార్మాస్యూటికల్, మెడికల్ డివైజ్, ప్యాకేజింగ్ రంగాల్లో కొటెక్నా తన సేవలను విస్తరించనుంది.

ఫార్మా హబ్​గా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో ఎనర్గాన్ ల్యాబ్స్ ఉండటం వల్ల అత్యుత్తమ సైంటిఫిక్ నిపుణులు, ఆధునిక ల్యాబ్ సదుపాయాలు కొటెక్నాకు అందుబాటులోకి వస్తాయి. చాలాదేశాల్లోని ఫార్మా కంపెనీలకు ఈ సంస్థ సేవలు అందిస్తోందని ఎనర్గాన్ ఫౌండర్ మణికాంత్ రెడ్డి  తెలిపారు.