బస్తాపై క్యూఆర్ కోడ్..రేషన్ బియ్యం అక్రమాలకు చెక్

బస్తాపై క్యూఆర్ కోడ్..రేషన్ బియ్యం అక్రమాలకు చెక్
  • పంపిణీలో పారదర్శకత కోసం పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు  
  •     తొలివిడతలో 5 లక్షల టన్నుల బియ్యం.. కోటి బ్యాగులకు కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   
  •     నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి అమలుకు సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ సన్నాహాలు
  •     బియ్యం అక్రమ రవాణాకు చెక్​పెట్టేందుకు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం అక్రమ రవాణా, పక్కదారి పట్టించే వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేందుకు సివిల్ సప్లయ్స్​శాఖ లేటెస్ట్​ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే సన్నబియ్యం గన్నీ బ్యాగులపై క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ముద్రిస్తోంది. బియ్యం సరఫరా, నిల్వలు, పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతోపాటు అక్రమాలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టును చేపట్టనుంది. తొలివిడతలో ఐదు లక్షల టన్నుల బియ్యం సరఫరాకు సంబంధించి కోటి గన్నీ బ్యాగులకు క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలు చేయనుండగా, వచ్చే నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఈ విధానాన్ని ప్రారంభించేందుకు శాఖ సన్నాహాలు చేస్తోంది. 

ఇప్పటికే ఫిజికల్ వెరిఫికేషన్ యాప్​ ద్వారా మిల్లుల్లో స్టాక్ మాయం కాకుండా ధాన్యం బస్తాల్లో లెక్కల్లో తేడాలు గోల్ మాల్ కాకుండా డిజిటల్ విధానం అమలు చేస్తుండగా, తాజాగా మరో కొత్త డిజిటల్ వ్యవస్థను అమలు చేయనుంది. రాష్ట్రంలో నెల నెలా 2.16లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం అవుతాయి. కోటీ 5లక్షల రేషన్ కార్డుల్లోని 3 కోట్ల 20లక్షల మంది లబ్ధిదారులకు నెలనెలా 6 కిలోల చొప్పున ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే ఈ క్యూఆర్ కోడ్​ను ట్రయల్ రన్​గా కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. మిల్లర్​ నుంచి బఫర్ గోడౌన్ నుంచి ఎంఎల్ఎస్​ పాయింట్​లు అక్కడి నుంచి రేషన్​ షాపునకు ఈ రేషన్ తరలుతుంది. అయితే ఈ వ్యవస్థ అంతా పకడ్బందీగా సజావుగా పారదర్శకంగా జరిగేందుకు ఈ డిజిటల్ విధానం అమలు చేయనున్నారు.

సరఫరా దశలన్నింటిపై నిఘా..

రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం మిల్లుల నుంచి గోదాములకు, అక్కడి నుంచి మండల స్థాయి స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లకు (ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), అనంతరం రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దుకాణాలకు చేరే ప్రతి దశనూ డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంలో నమోదు చేయనున్నారు. బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ దుకాణానికి వెళ్లింది? క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా గుర్తించేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. దీంతో బియ్యం నిల్వలు, తరలింపు, పంపిణీ వివరాలను పరిశీలించడం ఆఫీసర్లకు సులభం కానుంది. తొలివిడతలో ఐదు లక్షల టన్నుల బియ్యానికి సంబంధించిన కోటి గన్నీ బ్యాగులపై క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలు చేయనున్నారు. పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్రారంభించి, అమలు తీరును పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలన్నది శాఖ ఉద్దేశం.

అక్రమ రవాణా జరిగితే బాధ్యులపై చర్యలు..

ఎక్కడైనా రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం అక్రమ రవాణాలో పట్టుబడితే, బస్తాపై ఉన్న క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి అది ఏ రేషన్​ షాప్, ఏ డీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధి నుంచి సరఫరా అయిందో తెలుసుకోవచ్చు. ఆ వివరాల ఆధారంగా విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడినట్లు తేలితే సంబంధిత బాధ్యులు, డీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేయడం, లైసెన్సు రద్దు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అక్రమంగా బియ్యం కొనుగోలు చేసినవారు, తరలించిన మార్గం వంటి వివరాలనూ దర్యాప్తులో గుర్తించేందుకు ఈ సమాచారం తోడ్పడనుంది. నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు ద్వారా రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడంతోపాటు ప్రభుత్వ ధాన్యం నిర్దేశిత మార్గంలో లబ్ధిదారులకు చేరేలా చూడాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

స్కానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యాకే స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..
బియ్యం బస్తాలు ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లకు చేరినప్పుడు సంబంధిత సిబ్బంది మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా బ్యాగులపై ఉన్న క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను స్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు. గోదాము, వాహనం, బస్తాల సంఖ్య, బియ్యం పరిమాణం వంటి వివరాలను నమోదు చేసి, వచ్చిన సరుకుతో సరిపోల్చుకుంటారు. సాంకేతిక కారణాలతో కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకపోతే బ్యాగుపై ఉన్న సీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబరును నమోదు చేసే సదుపాయమూ ఉంటుంది. నిర్దేశిత స్కానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ పూర్తయ్యాకే స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీకరణను ధ్రువీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా బియ్యం దుకాణాలకు చేరకముందే ముందస్తుగా లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం, సరఫరా మార్గంలో బస్తాలు పక్కదారి పట్టించడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆఫీసర్లు భావిస్తున్నారు. క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేని బస్తాలను పంపిణీ ప్రక్రియలో అనుమతించకుండా, ప్రతి దశలో డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధ్రువీకరణ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.