RAPO23: రామ్ పోతినేనికి విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో... టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ!

RAPO23: రామ్ పోతినేనికి విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో... టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ!

టాలీవుడ్‌లోకి బాలీవుడ్ స్టార్ల ఎంట్రీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సంజయ్ దత్, బాబీ డియోల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి నటులు తెలుగు సినిమాల్లో ప్రతినాయకులుగా మెప్పించారు. ఇదే బాటలో ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నారు. యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'RAPO23' లో రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

రామ్ పోతినేని తొలిసారి మెగాఫోన్ పట్టడంతో  ' రాపో23' ( RAPO23 ) ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. హీరోగా తనదైన ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకునే రామ్.. ఈసారి దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు  కథ-స్క్రీన్‌ప్లే బాధ్యతలు కూడా ఆయనే చూసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతుండగా.. రితేశ్ దేశ్‌ముఖ్ కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ఎంట్రీతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇందులో రామ్ 'వీర' అనే వైవిధ్యమైన, స్టైలిష్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన సంయుక్త కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంగీత బాధ్యతలను సామ్ సీఎస్ నిర్వహిస్తున్నారు . రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ALSO READ : VijayRashmika: 'రణబాలి' సక్సెస్ జోరులో విజయ్–రష్మిక జంట.. 

దర్శకుడిగా రామ్ పోతినేని తీసుకున్న ఈ సాహసోపేతమైన అడుగు టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. బాలీవుడ్ నటుడి రాకతో పాన్-ఇండియా రేంజ్‌లో క్రేజ్ సంతరించుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే..