న్యూఢిల్లీ: భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ లీడర్ లాల్ కృష్ణ అద్వానీ సోమవారం (అక్టోబర్ 19) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా అక్టోబర్ 16న ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో అద్వానీ అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి ఆయనను పర్యవేక్షించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో సోమవారం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘ఛాతీ ఇన్ఫెక్షన్తో అక్టోబర్ 16న అపోలో ఆసుపత్రిలో చేరిన అద్వానీ సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. సీనియర్ కన్సల్టెంట్ -న్యూరాలజీ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది’’ అని ప్రకటనలో పేర్కొంది. 98 ఏళ్ల అద్వానీ వయసు రీత్యా ఆరోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది మే నెలలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు.
