బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఈ వారం సండే ఎపిసోడ్ ఊహించని ట్విస్ట్‌లు, విపరీతమైన డ్రామాకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.. అక్టోబర్ 18న ప్రసారమైన వీకెండ్ ఎపిసోడ్ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. డ్యాన్స్ ఫేస్-ఆఫ్‌తో సరదాగా మొదలైన ఈ ఎపిసోడ్, ఆ తర్వాత ఒక్కసారిగా ఉత్కంఠగా మారి, చివరికి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌తో ముగిసింది.
డ్యాన్స్ అండ్ పన్
సండే ఫండేలో నరేష్ టీమ్ అదరగొట్టగా, అమన్ తన డ్యాన్స్‌తో స్టేజీని షేక్ చేశాడు. ఇక నాగార్జున వేసిన పదునైన కౌంటర్లు, నీతూ-షాలిని డ్యాన్స్ సమయంలో రోహిత్ రియాక్షన్లపై హోస్ట్ చేసిన సెటైర్లు నవ్వులు పూయించాయి. మరోవైపు, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లపై ఓజీస్ ఇచ్చిన మిర్చి టాస్క్‌లో దక్షి టార్గెట్ కావడంతో ఆమెకు రెండు వారాల నామినేషన్ శిక్ష పడింది. రామ్ ప్రసాద్ 'స్టార్ ప్లేయర్'గా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు.
కన్నీటి వీడ్కోలు..
ఇక ఎలిమినేషన్ రేసులో రోహిత్ సేఫ్ కాగా.. చివరికి షాలిని, వర్షిణి మిగిలారు. నాగార్జున సస్పెన్స్ నడుమ షాలిని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో హౌస్‌లో ముఖ్యంగా రోహిత్ గుండె పగిలిపోయినంత పనైంది. షాలినిని హత్తుకుని రోహిత్ వెక్కి వెక్కి ఏడ్చిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఎవరెలా అనుకున్నా నాకు రోహిత్ అర్థం చేసుకుంటే చాలు.. కప్పుతో తిరిగి రా అంటూ షాలిని చెప్పింది. హౌస్ మేట్స్ అంతా షాలికి సెండాఫ్ చెప్పారు. స్టేజ్ మీదకు వెళ్లాక కూడా వంశీ, సుధీర్, వర్షిణులపై షాలిని తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ అసంతృప్తి వెళ్లగక్కింది.
అసలు ట్విస్ట్ ఇదే..
హౌస్‌మేట్స్ అందరూ షాలిని నిజంగానే వెళ్లిపోయిందని భావించి సవాలక్ష ఊహాగానాల్లో ఉంటే.. అసలైన షాక్ ఇచ్చారు బిగ్‌బాస్ . బయటకు వెళ్లాల్సిన షాలినిని వెనక్కి పిలిచి, ఆమె ఎలిమినేట్ కాలేదనీ చెప్పారు హోస్ట్ నాగార్జున. షాలిని నేరుగా సీక్రెట్ రూమ్‌కు వెళ్తున్నట్లు ప్రకటించారు.
ఇక అసలు మజా ఇక్కడే ప్రారంభం కానుంది. సీక్రెట్ రూమ్‌లో కూర్చుని షాలిని తన బెస్ట్ ఫ్రెండ్ రోహిత్ తన గురించి ఏం మాట్లాడుకుంటున్నాడు. మిగతా హౌస్‌మేట్స్ వేషాలేంటో లైవ్‌లో చూడబోతోంది. రోహిత్ నిజంగానే తనను ఎంతగా మిస్ అవుతున్నాడో తెలుసుకునే ఈ హై-వోల్టేజ్ డ్రామా రాబోయే ఎపిసోడ్లలో టీఆర్పీలను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్..
