టాలీవుడ్‌లో తొలి ప్రయత్నంతోనే బ్లాక్‌బస్టర్ విజయం సాధించి, టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరడం అంత సులభం కాదు. కానీ, ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రంతో దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఈ ఘనతను సాధించి తన అద్భుతమైన ప్రతిభను నిరూపించుకున్నారు. మొదటి సినిమాతోనే టాలీవుడ్ వర్గాల దృష్టిని విశేషంగా ఆకర్షించారు. ఈ చిత్రంలో జానకిరామ్ ప్రతిభ కామెడీ టైమింగ్, కమర్షియల్ యాక్షన్ సన్నివేశాల రూపకల్పనలో స్పష్టంగా కనిపించింది. భారీ కామెడీ సీన్లపై ఆధారపడకుండా, సింపుల్ వన్‌లైనర్స్ మరియు సహజమైన సంభాషణలతో థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
మరోవైపు, తన గురువు దర్శకుడు బాబీ బాటలోనే నడుస్తూ.. యాక్షన్ సీక్వెన్స్‌లను ఎంతో రిచ్‌గా, ఆకట్టుకునే విజువల్స్‌తో తెరకెక్కించి టేకింగ్ స్కిల్స్ చాటుకున్నారు. కామెడీని, యాక్షన్‌ను సమపాళ్లలో మిక్స్ చేస్తూ ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించడంలో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. తొలి చిత్రంతోనే వినోదానికి పెద్దపీట వేస్తూ కథను నడిపించిన తీరు ఆయనలోని పరిపక్వతను తెలపుతుంది.
‘కామ్రేడ్ కళ్యాణ్’ విజయంతో జానకిరామ్ మారెళ్లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదే జోరును కొనసాగిస్తూ భవిష్యత్తులో ఆయన ఎలాంటి వైవిధ్యమైన చిత్రాలు ఇస్తారోనని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
“Comrade Kalyan na life lo gurthundipotundhi. Telugu prekshakulu andhariki runapadi untanu” Director @janaki_ramz Speech at #ComradeKalyan DUSSEHRA FUNDAGA BLOCKBUSTER DISTRIBUTORS MEET 🤩❤️🔥 Watch Live Here! 🔗 https://t.co/byOvdhfRlK #LOLSalaam @sreevishnuoffl @KonaFilmCorp https://t.co/syVXyGStE3
— Kona Film Corporation (@KonaFilmCorp) October 16, 2026
బాక్సాఫీస్ వద్ద ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు..
‘కామ్రేడ్ కళ్యాణ్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.28.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ కోన ఫిల్మ్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇక ట్రేడ్ గణాంకాల ప్రకారం, ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్లు రూ.13.39 కోట్లుగా నమోదయ్యాయి. దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రెండో వారంలోకి అడుగుపెట్టి అలరిస్తుంది. రానున్న రోజుల్లో సినిమా వసూళ్లు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
𝟐𝟖.𝟒 𝐂𝐑 𝟏𝐬𝐭 𝐖𝐄𝐄𝐊 𝐖𝐖 𝐆𝐑𝐎𝐒𝐒 for #ComradeKalyan ❤️🔥❤️🔥❤️🔥 The Dussehra Fundaga Blockbuster enters 2nd week with Unlimited Entertainment in Theaters 💥💥💥 Book Your Tickets Now 🎟️ — https://t.co/P1y1Prq579 #LOLSalaam @sreevishnuoffl @KonaFilmCorp @svmpictures https://t.co/HYU2ATXlnb
— Kona Film Corporation (@KonaFilmCorp) October 16, 2026
