చెన్నూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేక్

చెన్నూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు..  పాల్గొన్న విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేక్

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 2026 అక్టోబర్ 19న కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సతీమణి, విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజ వివేక్ వేడుకల్లో పాల్గొన్నారు. 

చెన్నూరు మండలం కిష్టంపేట్, లంబడిపల్లె గ్రామాల్లో దుర్గామాత, హనుమాన్ ఆలయాల్లో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు.  సరోజా వివేక్ కు కమిటీ సభ్యులు, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.

అనంతరం లంబడిపల్లె తండాలో మహిళలతో కలిసి సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజనులు, చిన్నారులతో కలిసి సంబురంగా బతుకమ్మ ఉత్సవాల్లో ఆడిపాడారు. V6 బతుకమ్మ పాటకు గ్రామస్తులతో కలిసి ఆడిన ఆట అందరినీ ఆకట్టుకుంది. 

ALSO READ : కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కాఫర్ డ్యామ్ నిర్మించాలి

ఈ సందర్భంగా మాట్లాడిన ఎండీ సరోజా వివేక్.. అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.  పాడి పంటలు సమృద్ధిగా పండాలని దేవుళ్లను కోరుకున్నట్లు తెలిపారు.