సెన్సెక్స్ 876 పాయింట్లు క్రాష్ ..23 వేల దిగువకు నిఫ్టీ ..వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌

సెన్సెక్స్ 876 పాయింట్లు క్రాష్ ..23 వేల దిగువకు నిఫ్టీ ..వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌
  • మెప్పించని  ప్రైవేట్ బ్యాంకుల క్యూ2 రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • నేడు మార్కెట్లకు సెలవు 

ముంబై:  వరుసగా రెండు రోజుల పాటు ర్యాలీ చేసిన బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, సోమవారం భారీగా నష్టపోయాయి.   గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మార్కెట్లు నష్టాల్లో కదలడం,   హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడితో బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 876 పాయింట్లు (1.17 శాతం) నష్టపోయి 73,852.90 వద్ద ముగియగా, ఇంట్రాడేలో  వెయ్యి పాయింట్లకు పైగా  పతనమైంది.  

నిఫ్టీ  257.20 పాయింట్లు (1.11 శాతం) తగ్గి 22,889 వద్ద  సెటిలైంది.  సెన్సెక్స్ ప్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 3.85 శాతం నష్టపోయింది. సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  బ్యాంక్  కన్సాలిడేటెడ్ నికర లాభం  ఏడాది లెక్కన 39.4 శాతం వృద్ధి చెందినప్పటికీ, మార్జిన్లపై ఒత్తిడి కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. మరోవైపు  హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోవడంతో బ్యాంక్ షేరు 2 శాతానికి పైగా పడిపోయింది.  

అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీసీ షేర్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. మరోవైపు అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ అండ్ టీ, ఇండిగో, మారుతీ సుజుకీ షేర్లు లాభాలతో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే, బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ హౌసింగ్ ఫైనాన్స్ 2.42శాతం, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ 1.51శాతం, ఐటీ 1.38శాతం, బ్యాంకెక్స్ 1.23శాతం చొప్పున పతనమయ్యాయి.

అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్జిన్లు, ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉంటాయన్న అంచనాలతో పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ బ్యాంక్ ఇండెక్స్  మాత్రం  2.60శాతం లాభపడింది. అమెరికా మార్కెట్లు శుక్రవారం తీవ్ర నష్టాల్లో ముగియడం (నాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాక్ 2.14శాతం డౌన్), యూరప్ మార్కెట్లలో బలహీనతలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఆసియా మార్కెట్లలో కొరియా, చైనా లాభపడగా.. జపాన్ నష్టపోయింది. 

రూ.1,148 కోట్ల షేర్లు అమ్మిన ఎఫ్‌‌‌‌ఐఐలు

బ్రెంట్ ముడిచమురు 1.07 శాతం తగ్గి బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 108.7 డాలర్ల వద్ద ఉంది. ఫారిన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు)  శుక్రవారం రూ.1,166 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, సోమవారం మాత్రం రూ.1,148 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.  “ఇండియా స్టాక్ మార్కెట్లు గత శుక్రవారం లాభాలను కోల్పోయాయి. ఇండెక్స్ హెవీవెయిట్ అయిన ప్రైవేట్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి కనిపించింది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టెక్ షేర్లు నష్టపోతుండడంతో  నిఫ్టీ 23 లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందకు పడింది” అని రీసెర్స్ అనలిస్ట్ కంపెనీ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ వెల్త్ ఫౌండర్ హరి సెల్వన్ రాధాకృష్ణన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.  కాగా, దసరా సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు  మంగళవారం సెలవు.

తగ్గిన ఐటీ జోరు 

గత వారం ర్యాలీ చేసిన ఐటీ షేర్లు సోమవారం బోల్తా పడ్డాయి.  ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ మైండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రీ, ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లు రెండున్నర శాతానికి పైగా నష్టపోయాయి. మొత్తం ఐటీ ఇండెక్స్ 1.28 శాతం తగ్గింది.  వారాంతంలో విడుదలైన  ప్రైవేట్ బ్యాంకుల ఫలితాల్లో లాభాలు పెరిగినప్పటికీ.. నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి,  నిర్వహణ ఖర్చులు పెరగడం, ట్రెజరీ ఆదాయం తగ్గడం వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించాయని మార్కెట్ ఎనలిస్టులు తెలిపారు.