Chinmay Sutar: భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన సంచలనం నమోదు అయింది. రంజీ ట్రోఫీ హిస్టరీలో దాదాపు 78 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మిజోరాం బ్యాటర్ చిన్మయ్ సుతార్ (Chinmay Sutar) భారీ రికార్డును నెలకొల్పాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఏకంగా 400+ పరుగులు సాధించి క్వాడ్రపుల్ (Quadruple) సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ ఘనత సాధించడంతో రంజీ ట్రోఫీ చరిత్రలోనే 400 రన్స్ మైలురాయిని తాకిన రెండో బ్యాటర్‌గా చిన్మయ్ చరిత్ర సృష్టించాడు.
9 వికెట్లు పడిపోయినా ఒంటరి పోరాటం:
* ముంబైలో జన్మించి ప్రస్తుతం మిజోరాం తరఫున ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మైదానంలో చూపించిన పట్టుదల, పోరాటపటిమ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
* ఒంటరి పోరాటం: తొలి ఇన్నింగ్స్‌లో మిజోరాం జట్టు 392 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యే ప్రమాదంలో పడింది. ఆ సమయంలో మిగిలిన బ్యాటర్లు కేవలం 14 రన్స్ మాత్రమే సహకారం అందించినప్పటికీ, సుతార్ మాత్రం సింగిల్స్, బౌండరీలతో మైదానమంతా పరుగులు రాబట్టాడు.
* భారీ స్కోరు: చివరి వికెట్‌కు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి, జట్టు స్కోరును 581/9 (డిక్లేర్డ్) కు చేర్చాడు. మొత్తం 581 పరుగుల్లో చిన్మయ్ ఒక్కడే ఏకంగా 400 పరుగులు సాధించడం విశేషం.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10వ బ్యాటర్:
* భారత రంజీ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం బీబీ నింబాల్కర్ (B. B. Nimbalkar) మాత్రమే 400 కంటే ఎక్కువ పరుగులు చేశారు. 1948లో కాథియావాడ్‌పై మహారాష్ట్ర తరఫున ఆడుతూ నింబాల్కర్ అజేయంగా 443 రన్స్ కొట్టాడు. ఇప్పుడు దాదాపు ఎనిమిది దశాబ్దాల తర్వాత ఆ రికార్డు సరసన నిలిచిన రెండో భారత బ్యాటర్‌గా చిన్మయ్ నిలిచాడు.
* ప్రపంచ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 400+ కంటే ఎక్కువ పరుగులు సాధించిన 10వ బ్యాటర్‌గా చిన్మయ్ సుతార్ రికార్డులకెక్కాడు.
ఇంతకీ ఎవరీ ఈ చిన్మయ్ సుతార్:
మే 3, 1997న జన్మించిన చిన్మయ్ సుతార్ ముంబైలో పెరిగి, ముంబై జట్టుకే కాకుండా 2019 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో భారత్ అండర్ -23 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం మంచి అవకాశాల కోసం మిజోరాం జట్టులోకి మారిన చిన్మయ్, తన అద్భుతమైన ప్రతిభతో ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్‌లో తన ఉనికిని చాటుకున్నాడు.
Chinmay Sutar slams 400 not out to make history in the Plate group match between Mizoram and Nagaland. The Mumbai batter goes past Prithvi Shaw's 379 to record the second-highest score in #RanjiTrophy . He had fallen run out on 99 on debut in the previous round.
— Gaurav Gupta (@toi_gauravG) October 19, 2026
