డ్రైవర్ లేడు.. తాళం లేదు.. అయినా రివర్స్‌లో దూసుకెళ్లిన కారు ! యూపీలో వింత ఘటన !

 డ్రైవర్ లేడు.. తాళం  లేదు.. అయినా రివర్స్‌లో  దూసుకెళ్లిన కారు ! యూపీలో   వింత ఘటన !

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలో ఓ ఎలక్ట్రిక్ కారు అకస్మాత్తుగా వెనక్కి కదలడం స్థానికంగా కలకలం రేపింది. డ్రైవర్ లేకుండానే కారు కదులుతూ కొంత దూరం వెనక్కి వెళ్లడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే, కారు అదుపు లేకుండా కదలడంతో అక్కడ పెద్ద ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేది.

అసలు ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి నగరంలోని జైల్ రోడ్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సౌరభ్ రాథోర్ అనే వ్యక్తికి చెందిన టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు అనుకోకుండా వెనక్కి కదలడం ప్రారంభించింది. ఆ సమయంలో కారు డ్రైవింగ్ సీటులో ఎవరూ లేనట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది.

కారు ఓనర్ సౌరభ్ రాథోర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన ఆఫీసులో  ఉండగా ఈ ఘటన జరిగింది. తన మేనల్లుడు కారును క్లిన్ చేసేందుకు బయటకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో కారులో తాళం కూడా లేదని ఆయన పేర్కొన్నారు. అయితే, కారు అకస్మాత్తుగా వెనక్కి  కదలడంతో ఆయన మేనల్లుడు  కింద పడిపోయినట్లు  తెలిపారు. ఆ తర్వాత కారు వెనక్కి రివర్స్ లో కదులుతూ కొంత దూరం వెళ్లింది.  

ఈ ఘటనలో వెనక్కి  కదిలిన కార్  టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)గా తెలుస్తుంది. ఎలాంటి ఇండికేషన్ లేకుండా కారు రివర్స్ కదలడంతో  సౌరభ్ రాథోర్ ఆశ్చర్యానికి గురయ్యారు. వాహనంలో ఏదైనా   లోపం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కారు డ్రైవింగ్ సీటులో ఎవరూ లేకున్నా ,  వెనక్కి వెళ్లడం గమనించవచ్చు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : నవరాత్రి ఉత్సవాల్లో వింత ఘటన.. మహిళ శరీరంపై మొలిచిన బార్లీ విత్తనాలు..

ఈ ఘటనతో ఎలక్ట్రిక్ కార్ల సేఫ్టీ, వాటి కంట్రోల్ సిస్టం పనితీరుపై చర్చ మొదలైంది. సాధారణంగా కార్లు పార్కింగ్‌లో ఉన్నప్పుడు అవి అనుకోకుండా కదలకుండా ఉండేందుకు డ్రైవర్ సరైన పార్కింగ్ విధానాన్ని పాటించడం ముఖ్యం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి సాంకేతిక లోపంపై ఎలాంటి అధికారిక నిర్ధారణ వెలువడలేదు.